కొచ్చిలో శనివారం రోజు ఒక అత్యంత ఖరీదైన యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్ కారణంగా కోట్లలో నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. కోట్ల ఖరీదైన మెర్సిడెస్-బెంజ్ కార్లు చాలా దారుణంగా టీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదం విలింగ్డన్ ద్వీపం రోజు కేంద్రీయ విద్యాలయం ముందు రోడ్డుపై జరిగింది. ఈ రెండు కార్లూ అధిక వేగంతో ప్రయాణించే కార్లు. అదుపు తప్పి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుండగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ లగ్జరీ కార్లలో ఒకటి ఒక సామాన్య వ్యక్తి నడుపుతున్న కారును కూడా ఢీకొట్టింది అని పోలీసులు చెప్పారు.

ఒక మహిళ GT 63 SE అనే కారును నడుపుతూ రైల్వే గేటు దగ్గర నుంచి వేగంగా వస్తోంది. ఆమె కారు రోడ్డు పక్కన ఉన్న ఓల్డ్ రైల్వే లైన్‌ మీద ఉన్న ఎత్తైన భాగాన్ని తాకి అదుపు తప్పింది. తరువాత ఆమె కారు ముందు ఉన్న మరొక మాములు కారును ఢీకొట్టింది. ఇంకొక ప్రమాదం జరగకుండా ఆ యువతి కారును కుడివైపు మళ్ళించగా, ఎదురుగా వస్తున్న SL55 రోడ్‌స్టర్‌ కారును ఢీకొట్టింది. ఈ రెండో కారును ఒక మగ వ్యక్తి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు.

GT 63 SE అనే కారు ముందు భాగం ఢీకొన్న తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్నది. SL55 రోడ్‌స్టర్‌ కారు ముందు చక్రం బాగా దెబ్బతిని, తీసివేయవలసి వచ్చింది. ఈ ప్రమాదంలో లేడీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అని పోలీసు అధికారి తెలిపారు. "ఈ సంఘటన గురించి తెలిసి మేము సంఘటనా స్థలానికి వెళ్లి, దెబ్బతిన్న కార్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళాము. ఈ సంఘటనపై కేసు నమోదు చేశాం." అని హార్బర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి తెలిపారు.

కారు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రమాదంలో ఈ రెండు కార్లు సాధారణ కార్లు కాదు. మెర్సిడెస్-బెంజ్ కంపెనీ తయారు చేసిన చాలా ప్రత్యేకమైన మోడల్ కార్లు అవి. వాటి పేర్లు మెర్సిడెస్-బెంజ్ AMG SL55 రోడ్‌స్టర్‌, మెర్సిడెస్-బెంజ్ AMG GT 63 S E పర్ఫార్మెన్స్. SL55 రోడ్‌స్టర్‌ కారులో నలుగురు ప్రయాణించవచ్చు. ఈ కారులో 3982 సీసీల ఇంజిన్ ఉంటుంది. ఈ కారు హైపర్ బ్లూ మెటాలిక్ రంగులో ఉంటుంది. భారతదేశంలో ఈ కారు ధర రూ.2.44 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. GT 63 S E అనే కారులో కూడా నలుగురు ప్రయాణించవచ్చు. ఈ కారులో కూడా 3982 సీసీల ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ఆన్ రోడ్డు ప్రైస్ రూ.3.30 కోట్ల నుండి ప్రారంభం అవుతుంది. యాక్సిడెంట్ కే గురైన తర్వాత ఈ కార్లు పనికిరావు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కారు యాక్సిడెంట్ అయితే అది బాగా ఊగుతుంది. దానిపై వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టమవుతుంది. కాబట్టి అవి దాదాపు పనికిరానివిగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: