సాధారణంగా పిల్లలకు తల్లి జన్మనిస్తుంది. ఇలా అమ్మ నవ మాసాలు మోసి జన్మనిస్తే తండ్రి మాత్రం  పాతికేళ్లపాటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఉంటాడు. ఏకంగా పిల్లలకు నడకను నేర్పించేది.. ప్రపంచాన్ని పరిచయం చేసేది. మంచి చెడులు అంటే అర్థం చెప్పేది తండ్రే అన్న విషయం తెలిసిందే  పైకి ఎంతో గంభీరంగా కనిపించిన.. తల్లిలా అమితమైన ప్రేమను ఒలక బోయకపోయినా తండ్రి ఎప్పుడు తన పిల్లల కోసం పిల్లల కంటికి కనిపించని ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే తన జీవితాన్నే మొత్తం పిల్లల కోసం త్యాగం చేసి కష్టపడుతూ ఉంటాడు తండ్రి. అందుకే తల్లితో సమానంగానే తండ్రి పేరు కూడా ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు పెద్దలు.


 అయితే తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు కష్టం వచ్చింది అంటే చాలు ఆ కష్టాన్ని తీర్చేందుకు తండ్రి ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటాడు. ఎంత కష్టమైనా భరించడానికి రెడీగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారిపోయింది. ఏకంగా కొడుకు కోసం ఆరు బిర్యానీలను తిన్నాడు తండ్రి. అదేంటి కొడుకు కోసం ఎన్నో త్యాగాలను చేసిన తండ్రుల గురించి విన్నాం. కానీ ఇలా ఏకంగా బిర్యాని తినడమేంటి. అది త్యాగం ఎలా అవుతుంది అని అనుకుంటున్నారు కదా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత మాత్రం ఆ తండ్రి పడిన కష్టం ఎలాంటిదో అన్న విషయం అర్థం అవుతుంది.


 తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. ఓ తండ్రి తన కొడుకు కోసం బిర్యాని ఈటింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఓ రెస్టారెంట్ ఆరు బిర్యానీలు తిన్నవారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని.. ఒక పోటీ నిర్వహించింది. అయితే ఆటిజం సమస్యతో బాధపడుతున్న తన కుమారుడు చికిత్స ఖర్చులకోసం ఆ డబ్బులు పనికి వస్తాయని భావించాడు తండ్రి. దీంతో ఒకవైపు కొడుకు ఆరోగ్యం బాగాలేదు అన్న దుఃఖాన్ని దిగమింగుకొని ఈటింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఒకవైపు కన్నీటి పర్యంతమవుతూనే అతను బిర్యాని తిన్నాడు. అయితే కడుపులో పట్టకపోయినా ఒకవైపు పొట్టలో నుంచి నొప్పి వస్తున్న కూడా అతను కొడుకు కోసం ఇక బిర్యానీలు తిన్నాడు. మొత్తంగా ఆరు బిర్యానిలు తిన్నాడు. అయితే ఇందులో విజేతగా ఎవరు నిలిచారు అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: