అయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది గాయాల బారిన పడి జీవచ్చవాలుగా మారిపోతుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇలాంటి వీడియోలలో కొన్ని ఏకంగా గగుర్పాటుకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ప్రయాణం అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్నా సమయంలో రెప్పపాటు కాలంలో ఊహించని ప్రమాదాలు ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి గగుర్పాటుకు గురి చేసే రోడ్డు ప్రమాదం గురించే.
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనం లేదంటే వెనకనుంచి వస్తున్న వాహనం ఢీకొట్టడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని తెలుసు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఊహించని ప్రమాదం. జైపూర్ లోని కోత్వార సమీపంలో కలపలోడుతో హైవే మీద వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పింది. దీంతో కల్వర్టు మీద నుంచి సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న నీటి ట్యాంకర్ పై పడింది. అయితే ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయింది. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా గాయాలైనట్లు సమాచారం. ఇలా హైవే పైనుంచి సర్వీస్ రోడ్డు మీద ట్రక్కు పడుతున్న సమయంలో.. అందులో నుంచి దూకి ట్రక్కు డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.