అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో తోడేళ్లు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. తోడేళ్లు ఏకంగా సింహాలకు సైతం వణుకు పుట్టించగలవు. ఎందుకంటే ఎప్పుడు గుంపుగా ఉండే తోడేళ్లు ఇక సింహాలు, పులులను సైతం కొన్ని కొన్ని సార్లు వేటాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక గుంపుగా దాడి చేస్తూ ఏకంగా వేటను కొనసాగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే తోడేళ్లు ఎంత దారుణంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు.. ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ప్రతి ఒక్కరి వెన్నులో మనకు పుట్టిస్తూ ఉంటాయి.



 అయితే అడవుల్లో ఉండే జంతువులను ఇలా తోడేళ్ల గుంపులు వేటాడుతూ ఉంటేనే.. భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది తోడేళ్ల గుంపు ఏకంగా మనుషులపై దాడి చేయడం మనుషులను పీక్కు తినడం లాంటివి జరిగితే ఇక అందరూ ప్రాణ భయంతో వణికిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల యూపీలోని బాహ్రాయిచ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అక్కడ తోడేళ్ళ గుంపు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలపై దాడి చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కూడా తీసేసాయి. ఏకంగా 8 మందిని చంపేసాయి తోడేళ్ల గుంపు.



 ఇక ఈ విషయం దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నరభక్షక తోడేళ్లుగా మారిన ఆ జీవులను కనిపించిన వెంటనే చంపేయాలి అంటూ ఆర్డర్స్ కూడా వచ్చాయి. కాగా తోడేలు తమకు తమ పిల్లలకు హాని చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బహరైచ్ లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొనడంతో చనిపోయాయ్. అప్పటి నుంచి అవి ప్రతీకారంతో రగిలిపోతూ కనిపించిన ప్రజలపై దాడి చేస్తున్నాయి. కొన్ని తోడేళ్లని దూరంగా తీసుకువెళ్లి వదిలిపెట్టినప్పటికీ మళ్లీ బహరైచ్ ప్రాంతంలోకి వస్తూ వేటను కొనసాగిస్తున్నాయని నిపుణులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: