నేటి మోడ్రన్ జనరేషన్ లో మనుషుల ఆలోచన తీరులో ఎంతల మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నేటి సోషల్ మీడియా యుగంలో కొంతమంది మనుషులు చేస్తున్న పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే ఇలా ఫాలోవర్లను పెంచుకోవడం కోసం పిచ్చి పనులను చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి.


 మరి ముఖ్యంగా ఫ్రాంక్ వీడియోల పేరుతో ఏకంగా జనాలను ఇబ్బంది పెడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి  అయితే కొంతమంది ఇక ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసి చివరికి ఇబ్బందులు పడటం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఈ మధ్య కాలంలో ఫాలోవర్లు ఇచ్చిన ఛాలెంజ్ ను చేసి చూపించడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇక్కడ ఒక యూట్యూబర్ ఇలాంటిదే చేశాడు.


 అతను చేసిన పని మాత్రం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సును ఆపి ఆ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన ఫాలోవర్స్ ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ఇలా చేశాడు ఆ యువకుడు. అయితే ఈ వీడియో వైరల్ గా మారగా దీనిపై ఆర్టీసీ సంస్థ ఎండి సజ్జనర్ ఫైర్ అయ్యారు.  సోషల్ మీడియాలో పాపులరిటి కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా.. బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందని సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైకులు కామెంట్లు కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్తు పైపు బాటలు వేసి ఉన్నత శిఖరాలను అందుకోండి అంటూ సజ్జనర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: