అయితే ఈ మధ్యకాలంలో అటు ప్రయాణాలు సాగించడం విషయంలో కూడా టెక్నాలజీ మీదే ఆధారపడిపోతున్నాడు మనిషి. ఒకప్పుడు తెలియని ప్రదేశాలకు వెళ్ళాలి అంటే రోడ్డుపై కనిపిస్తున్న వ్యక్తులను దారి అడుగుతూ ముందుకు సాగే వారు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని.. అది ఎటు తిప్పితే అటే వెళ్తూ ఉన్నారు. అయితే గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా ఫాలో అయితే చివరికి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల ద్వారా అందరికీ అర్థమవుతుంది. అయితే ఇటీవలే విజయవాడలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తల్లి కొడుకు బు డమేరు వాగులో చిక్కుకొను ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగు లోకి వచ్చింది. శ్రీశైలం దర్శనం ముగించుకున్న 9 మంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని కారు లో రిటర్న్ అయ్యారు. అయితే గూగుల్ మ్యాప్ నేరుగా వారిని తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా సిరసవాడ దుందుభి వాగులోకి తీసుకు వెళ్లింది. అక్కడ చిక్కుకున్న వారిని ఏకంగా గ్రామస్తుల సహాయం తో పోలీసులు ట్రాక్టర్ తో సహా సురక్షితంగా బయటకు తీయగలిగారు. ప్రాణాపాయం ఏమి జరగకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.