తెల్లకోటు వేసుకుని వైద్యం చేసే డాక్టర్లను ప్రత్యక్ష దైవంగా అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే గుడికి వెళ్తే ఆ దేవుడు అయినా వరాలు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఆసుపత్రికి అనారోగ్య సమస్యతో వెళితే మాత్రం డాక్టర్ తప్పకుండా చికిత్స చేసి ప్రాణాలను నిలబెడుతూ ఉంటాడు. అందుకే వైద్య వృత్తిపై అందరికీ గౌరవం ఉంటుంది. మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన తర్వాత ఇక ఇలా వైద్యవృత్తిపై ఉన్న గౌరవం మరింత పెరిగిపోయింది.


 దీంతో వైద్యులందరినీ కూడా మరింత గౌరవించడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కొంతమంది వైద్యులు వ్యవహరిస్తూ ఉంటారు. ఏకంగా నిర్లక్ష్యంతో చికిత్స అందిస్తూ చివరికి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు బలై ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బీహార్ లో ఒక వైద్యుడు కారణంగా అభం శుభం తెలియని బాలుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరిని షాక్ కి గురిచేస్తుంది.


 ఇప్పుడు వరకు ఎంతో మంది సామాన్య ప్రజలు యూట్యూబ్లో చూసి సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకోవడం చూసాము. కానీ ఇక్కడ విచిత్రకరమైన ఘటన జరిగింది. బీహార్ లో ఒక డాక్టర్ యూట్యూబ్ చూస్తూ సర్జరీ చేయడంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. అనారోగ్యంగా ఉన్న ఒక 15 ఏళ్ల బాలుడుని అతను కుటుంబ సభ్యులు సరన్ ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అజిత్ అనే వైద్యుడు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే.. బాలుడికి పిత్తాశయ్య సర్జరీని యూట్యూబ్లో చూస్తూ చేశాడు. అనంతరం బాలుడు చనిపోవడంతో సిబ్బందితో సహా పరారయ్యాడు. అయితే పోలీసులకు ఈ విషయం తెలియడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: