ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వినాయక చవితి సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏ పండుగ వచ్చినా కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే పండగ శోభ సంతరించుకుంటూ ఉంటుంది. కానీ వినాయక చవితి వస్తే మాత్రం ఏకంగా తొమ్మిది రోజులపాటు ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన మండపాలలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు.


 ఇక గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఎంత ఘనంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నలు  పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా గణేష్ నిమజ్జనంలో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం చేసే పొరపాట్ల కారణంగా ఇలా సంతోషంగా సాగిపోతున్న గణేష్ నిమజ్జనంలో చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. గణేష్ నిమజ్జన కార్యక్రమం 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది.




 గుజరాత్ లోని దహేగాం తాలూకా లో ఈ విషాదకర ఘటన జరిగింది. ఎంతో ఆనందంగా సాగి పోయిన వినాయక నిమజ్జనం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన 8 మంది యువకులు నీటిలో మునిగి చని పోయారు.  కొందరు యువకులు గణేశుడు నిమజ్జనం చేసేందుకు మేషోఓ నదికి వెళ్లారు. అయితే నిమజ్జనం అనంతరం ఒక యువకుడు ఈత కొడుతూ మునిగి పోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు నీటిలో దూకి చివరికి మునిగి పోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ ఘటన పై ప్రధాని మోదీ సంతాపం తెలియ జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: