భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి పెళ్లి అనే బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఏకంగా పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతున్న ఆ బంధం ఎక్కువ కాలం నిలవడం లేదు. చిన్న చిన్న కారణాలకే మనస్పర్ధలతో పెళ్లి చేసుకున్న వారు.. చివరికి విడిపోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 సాధారణంగా ఇలా వైవాహిక బంధం లోకి అడుగు పెట్టిన భార్యాభర్తలు చివరికి విడిపోవడానికి సిద్ధమయ్యారు అంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని అందరూ అనుకుంటారు. అయితే చాలామంది కూడా ఇలా పెద్ద కారణాలు ఉండి ఒకరితో ఒకరు కలిసి ఉండలేమని జీవించుకున్నప్పుడు మాత్రమే విడాకులు తీసుకొని వేరుపడాలి అని నిర్ణయించుకోవడం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రం చిన్న చిన్న కారణాలకే చివరికి డివర్స్ తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. యూపీలోని ఆగ్రలో ఓ భార్య భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయింది. అయితే కారణం మాత్రం అందరిని అవాక్కేలా చేస్తుంది. తన భర్త స్నానం చేయట్లేదు అన్న కారణంతో పెళ్లయిన 40 రోజులకే భార్య విడాకులు కోరింది. తమ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడని కోర్టుకు తెలిపింది. స్నానం చేయకపోగా వారనికోసారి గంగాజలం చల్లుకుంటాడని దుర్వాసన వస్తుంది అంటూ తెలిపింది. అతనితో కలిసి జీవించడం తన వల్ల కాదు అంటూ వాపోయింది. అయితే కౌన్సిలింగ్ తర్వాత రోజు స్నానం చేస్తానని భర్త చెప్పినప్పటికీ అతడితో కలిసి జీవించేందుకు భార్య మాత్రం ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: