నేటి రోజుల్లో రియల్ లైఫ్ ప్రపంచంలో బ్రతకడానికి కంటే రీల్ లైఫ్ ప్రపంచంలో బ్రతకడానికి ఎంతో మంది జనాలు ఆసక్తిని కనబరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాకు అతిగా కనెక్ట్ అయిపోతూ చివరికి ఎడిక్ట్ అవుతున్నారు. అయితే ఇక సోషల్ మీడియా కూడా ఎన్నో విశేషాలకు చిరునామాగా మారిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనల గురించి తెలుసుకోవడం చేస్తూ ఉన్నారు ఇంటర్నెట్ జనాలు. అయితే ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా కోట్ల విలువ చేసే అరుదైన పెయింటింగ్ లు చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటాయి. సామాన్యులకు ఇలాంటి పెయింటింగులను కొనుగోలు చేయడం కానీ..ఇంట్లో పెట్టుకోవడం కానీ అసలు సాధ్యం కాదు అని చెప్పాలి. ఇక ఇలా కోట్ల విలువ చేసే అరుదైన పెయింటింగ్ లను ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి విలువైన పెయింటింగ్ చెత్త కుప్పలో పడేశారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఆ పెయింటింగ్ బయటపడటంతో ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిపోయింది. 62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి ఇక అక్కడ ఉన్న చెత్త కుప్పను శుభ్రం చేస్తుండగా.. ఒక పెయింటింగ్ దొరికింది. అయితే అదేదో పిచ్చి బొమ్మ అనుకొని ఆ కుటుంబం పక్కన పెట్టేశారు. అయితే ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ ఇంటి యజమాని కుమార్తె ఆ పెయింటింగ్ పికాసో కళాఖండంగా గుర్తించారు. ఇక ఆ తర్వాత ఆ పెయింటింగ్ విలువ తెలిసి ఒక్కసారిగా నరేళ్లపెట్టారు. ఎందుకంటే ఆ పెయింటింగ్ విలువ అక్షరాల 46 కోట్లు. అపురూపమైన పెయింటింగ్ ను లాకర్లో భద్రపరిచామని.. ఏం చేయాలన్న దానిపై పికాసో ఫౌండేషన్ తో మాట్లాడుతున్నామని ఆ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: