పగ పదునైన కత్తి లాంటిది. ప్రత్యర్థిని కసి తీరా పొడిచి చంపే వరకు పగ చల్లారదు. కత్తికున్న పదును తగ్గదు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇది మరింత కిరాతకంగా,అత్యంత పాశవికంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నే మొరాదాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. యువకుడిని దారుణంగా హత్య చేసి, తల నరికి చంపారు. సోను హత్యకు ప్రియురాలు కుట్ర పన్నింది. సోదరుడు సద్దాంతో కలిసి సోను హత్య. సద్దాం కత్తితో సోను గొంతు కోసి హత్య చేశాడు. సద్దాం గుర్తింపును చెరిపేసే ప్రయత్నం. సద్దాం శరీరం నుంచి తలను వేరు చేశాడు.ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా..అసలుసంగతి ఏమిటంటే యూపీలోని మొరాదాబాద్లో తల లేని మొండెన్ని ఓ చెరుకుతోటలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ తలలేని శరీరాన్ని మార్చురీకి తరలించారు. ఆ తర్వాత తన కుమారుడు పందొమ్మిదేళ్ల సోను కాలేజీకి అని వెళ్లి మళ్లీ రాలేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు ఆ బాడీని చూపించడంతో అది తన కుమారుడిదేనని గుర్తించి కుప్పకూలిపోయాడు. తనకు ఎవరూ శత్రువులు లేరని తన కుమారుడ్ని ఎందుకు అలా చంపారో తెలియదని సోను తండ్రి బావురుమన్నాడు. పోలీసులు సోను కాల్ లిస్ట్ ను వెలికి తీయడంతో చివరి కాల్ ఓ అమ్మాయిదని తేలింది.

ఆ అమ్మాయిని పిలిపించి ప్రశ్నించడంతో మొదట తనకు ఏమీ తెలియదని బుకాయించింది. కానీ తర్వాత మాత్రం అసలు విషయం చెప్పింది. తానే సోను ను కాల్ చేసి చెరుకుతోట వద్దకు పిలిపించానని.. తాము ఇద్దరం చెరుకుతోటలో శృంగారంలో పాల్గొన్నామని ఆ తర్వాత అతన్ని హత్య చేశానని మెడను కత్తిరించి తలను సంచిలో పెట్టుకుని వెళ్లిపోయానని చెప్పింది. ఇలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో కూడా ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. కాలేజీలో సోను పరిచయమయ్యాడని..తామిద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమన్నారు. అయిత్ ప్రైవేటు వీడియోలను ఫోన్లో షూట్ చేసి రోజూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఇద్దరు బంధువుల సాయంతో సోనును హత్య చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రణాళిక ప్రకారం చెరుకుతోటకు పిలిపించానన్నారు. గుడ్డిగా నమ్మిన సోను చెరుకుతోటలో ప్రాణాలు కోల్పోయారు. తీసుకెళ్లిన తలను ఎక్కడ పడేశారో కూడా చెప్పారు. అ అమ్మాయితో పాటు సహకరించిన మరో ఇద్దరిని మొరాదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అందరిలో వణుకు పుట్టించింది. అమ్మాయిలు కూడా ఇంత దారుణానికి వడికడుతున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: