కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి సమీపంలో ఓ లేడీ యోగా టీచర్‌పై ఓ దారుణం చోటు చేసుకుంది. అయితే ఆమె ఈ దారుణం నుంచి తన బ్రీతింగ్ కంట్రోల్ టెక్నిక్ తో తన ప్రాణాలను కాపాడుకుంది. వివరాల్లోకి వెళ్తే, 34 ఏళ్ల తమన్నా (పేరు మార్చబడింది) అనే యోగా టీచర్‌ను అక్టోబర్ 23న కిడ్నాప్ చేసి, దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి తీసుకెళ్లి, నిర్బంధించారు. అక్కడ ఆమెను దుస్తులు లేకుండా చేసి, లైంగికంగా వేధించి, ఉక్కిరిబిక్కిరి చేశారు. చివరకు ఆమెను గొంతు నులిమి చంపాలని ప్రయత్నించారు.

కానీ, తమన్నా తన బ్రీతింగ్ కంట్రోల్ స్కిల్స్ ఉపయోగించుకుని చనిపోయినట్లు నటించింది. దాంతో దొంగలు ఆమె చనిపోయిందని భావించి, ఒక గుంత తవ్వి ఆమెను అందులో వేసి, తక్కువ మట్టితో కప్పేశారు. ఆ తర్వాత ఆమె ఆభరణాలను తీసేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొంత సమయం తర్వాత తమన్నా ఆ గుంత నుంచి బయటపడింది. అక్కడ ఉన్న కొంతమంది గ్రామస్థుల దగ్గర నుంచి దుస్తులు తీసుకుని, మరుసటి రోజు చిక్కబళ్లాపూర్‌లోని సిద్దలఘట్టలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.

ఈ కేసులో నలుగురు పురుషులు, ఒక మహిళ మరియు ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కిడ్నాప్ ప్లాన్‌ను 27 ఏళ్ల బిందు అనే మహిళ రూపొందించింది. బిందు తన భర్త సంతోష్ కుమార్ తమన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించింది. బెంగళూరులో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న తన స్నేహితుడు సతీష్ రెడ్డిని తమన్నా గురించి తెలుసుకోవాలని కోరింది.

సతీష్ యోగా నేర్చుకోవాలనే నెపంతో తమన్నాతో స్నేహం చేశాడు. అక్టోబర్ 23న ఉదయం 10:30 గంటలకు తమన్నా ఇంటికి వెళ్లి, తనతో కలిసి రైఫిల్‌ షూటింగ్‌కు వెళ్లమని ఆహ్వానించాడు. తమన్నా కారులో వెళ్తుండగా, మరో ముగ్గురు వ్యక్తులు, ఒక అబ్బాయి కారులోకి ఎక్కారు. అందరూ కలిసి సిద్దలఘట్ట తాలూకాలోని ధనమిట్టెనహళ్లిలోని అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తమన్నాను బెదిరించి, వివస్త్రను చేశారు. ఆపై లైంగికంగా వేధించారు. ఆ తర్వాత ఆమెను ఒక తీగతో గొంతు నులిమే ప్రయత్నం చేశారు.

 అలా చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆమె ఒక్కసారిగా గొప్ప కూలిపోయింది. బ్రీతింగ్ ఆపేసి చనిపోయినట్లుగా పడిపోయింది. దీంతో దొంగలు ఆమె చనిపోయిందని భావించి పారిపోయారు. పోలీసులు ఈ కేసులో బిందు, సతీష్ రెడ్డి (40), రమణ (34), నాగేంద్ర రెడ్డి (35), రవిచంద్ర (27), ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. సతీష్, రమణ, నాగేంద్రలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, రవిచంద్ర, ఆ బాలుడు రాయచూరు జిల్లాకు చెందినవారు. ఈ అరెస్టులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. ఏది ఏమైనా ఈ యోగా టీచర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: