కనిపించని ప్రాణాంతకమైన వైరస్ కు భయపడి ప్రతి ఒక్కరూ గడప దాటి రాకుండా ఇంట్లోనే ఉండిపోతే.. అటు డాక్టర్లు మాత్రం కుటుంబాన్ని సైతం వదిలేసి సమాజ రక్షణ కోసం నడుం బిగించి.. వైద్యం అందించారు. ఇక ఇలా కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడి అదే కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే కరోనా తర్వాత డాక్టర్ల విలువ ప్రతి ఒక్కరికి తెలుసొచ్చింది. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఏకంగా డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు.
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా డాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక కంటికి ప్రాబ్లం ఉందని హాస్పిటల్ కి వెళ్తే మరో కంటికి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఉత్తర ప్రదేశ్ గ్రేటర్ నోయిడాకు చెందిన నితీష్ భాటి తన కొడుకుకు ఎడమకంటి నుంచి తరచూ నీరు కారుతుంది అనే సమస్యతో ఆనంద్ స్పెక్ట్రమ్ అనే హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యలు బాలుడు కంట్లో ఫారన్ బాడీ అంటే మెటల్ వంటి దూళి ఉంది అని గుర్తించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ కూడా పూర్తయింది. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడు ఎడమ కంట్లో సమస్య ఉంటే.. అటు డాక్టర్లు కుడి కంటికి ఆపరేషన్ చేశారని పరీక్షల్లో తేలింది. దీంతో ఇక వైద్యుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాలుడు తండ్రి.