నేటి రోజుల్లో సోషల్ మీడియా మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది అన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తెలియని విషయాలను.. ప్రతి విషయంపై అవగాహన పెంచుకునేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలను కూడా ఇక ఇలాంటి ఇంటర్నెట్ కారణంగా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇలా సోషల్ మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదే సమయంలో ఇంటర్నెట్ మాయలో మునిగిపోతున్న ఎంతో మంది యువత.. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రజలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇక ఇదే సోషల్ మీడియా ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెడుతుంది. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతుంది.


 నేటి రోజుల్లో సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకోవాలని లైక్స్ కావాలని ఆరాటపడుతున్న ఎంతోమంది.. చివరికి కొన్ని పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో చాలానే ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఈత రానివారు నీళ్లలోకి దిగాలంటేనే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ మునిగిపోయి ప్రాణాలు పోతాయో అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈత కొట్టడం రాని వాళ్ళు ఎప్పుడూ నీటికి దూరంగానే ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అలా చేయలేదు.


 ఈతరాని వారు చెరువులో దిగడానికే భయపడితే.  ఇక్కడ ఒక యువకుడు స్విమ్మింగ్ రాకపోయినా ఏకంగా ఒక పెద్ద డ్యామ్ లో దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ఇలా చేశాడు అన్నది తెలుస్తుంది. మధ్యప్రదేశ్లో గుణాకు చెందిన ఒక యువకుడు ఈత రాకపోయినప్పటికీ అటు డ్యామ్ లో జంప్ చేసి వీడియోని చిత్రీకరించారు. అయితే దూకిన వ్యక్తికి సరిగా స్విమ్మింగ్ రాకపోవడంతో చివరికి పైకి రాలేకపోయాడు. అతని కోసం గాలించగా చివరికి వివిధ జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా మాయలో పడి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటూ సూచిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: