బుచ్చమ్మ మరణంతో హస్తాల్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆమె మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చలి నుంచి ఉపశమనం పొందాలని చేసిన ప్రయత్నం ఇంతటి విషాదానికి దారితీయడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన చలికాలంలో మంటల వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈదురు గాలులు భారతదేశ వ్యాప్తంగా వీస్తున్నాయి. దానికి తుఫాను తోడయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు చంపుతున్నారు. ఈ వాతావరణంలో ఇంకా మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చల్లటి వాతావరణం లో పాములు ఇళ్లలోకి చేరబడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా రెండు నెలల చలికాలం పూర్త ఎండాకాలం ప్రారంభమవుతుంది అప్పుడు ఎండలు మండుతాయి. ఆ కాలంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.