కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి బిక్కనూరు మండలం ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలంగా మారింది. వారు మాత్రమే కాకుండా, నిఖిల్ అనే మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతులకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చెరువు వద్ద లభించడంతో మరణించింది వారేనని పోలీసులు నిర్దారించారు. కారుతోపాటు నిఖిల్ చెప్పులు చెరువు వద్ద పోలీసులు గుర్తించడం జరిగింది. సుమారు 5 గంటలకుపైగా ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం గమనార్హం.

దాంతో బుధవారం అర్ధరాత్రి వరకు పోలీసులు, సహాయక బృందాలు పెద్ద చెరువులోని మృతదేహాలను వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లక్యం కాగా, సాయికుమార్ మృతదేహం ఇంకా దొరకలేదు. అయితే, వీరంతా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడడం సర్వత్రా పెను సంచలనంగా మారగా అనేక విషయాలు ఇక్కడ వెలుగు చూశాయి. వీరు ముగ్గురు వివాహేతర సంబంధాలు వెలగబెట్టడంతోనే ఇలా తనువులు చాలించారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విషయం ఏమిటంటే, కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి, సాయి కుమార్ కి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని వినికిడి. ఇక ఎస్సైకి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు సమాచారం. ఆ తరువాత ఎస్సై సాయి కుమార్ బదిలీ అనంతరం బిక్కునూర్ వెళ్లిపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి సన్నిహితం పెరిగి అది కాస్త మరో వివాహేతర సంబంధం ఏర్పడడానికి కారణమైందని వినికిడి. అయితే ఈ విషయం తెలిసిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరిగినట్లు, ఈ క్రమంలోనే వారంతా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా సమాచారం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: