- ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) . .


తెలంగాణ పోలీసు శాఖలో కలకలం రేపిన ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్సై సాయి .. మహిళా కానిస్టేబుల్ శ్రుతి .. మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా ముగ్గురు కుటుంబాల నుంచి ఈ సంఘటనపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎస్సై సాయి ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి - ఆప‌రేట‌ర్ నిఖిల్ ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్సై సాయి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు శృతి ధైర్య‌వంతురాలు అని .. ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువు ల నుంచి కూడా ఎస్సై - కానిస్టేబుల్ వైపు ఆరోపణలు వస్తున్నాయి.


అసలు వారు చెరువు వద్దకు ఎందుకు ? వచ్చారు .. ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయే చనిపోయా రా ?లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ సాయి - కానిస్టేబుల్ శృతి - మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖపరమైన దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులు మరోవైపు మృతులు ముగ్గురి ఫోన్ కాల్స్ సిగ్నల్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు ? ఎక్కడ కలిశారు . ? ఎటువైపు నుంచి ఎక్కడికి వెళ్లారు ? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఏది ఏమైనా ఈ కేసులో ముగ్గురు మృతుల బంధువులు పరస్పరం విరుద్ధ ఆరోపణలు చేసుకోవడంతో అసలు ఏం జరిగింది ? ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: