మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్ తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి అక్రమ సంబంధం ఉందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాలా మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ కారణంగా తమను హత్య చేయాలని చూస్తున్నాడని మహేందర్ భార్య జ్యోతి ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై మహిళ తెలిపిన వివరాల ప్రకారం.... నల్గొండలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న చాలా మహేందర్ 2010లో నార్కట్పల్లికి చెందిన తనను వివాహం చేసుకున్నాడని జ్యోతి వెల్లడించింది. 

తమకు కవల పిల్లలుగా ఒక బాబు, ఒక పాప జన్మించారని జ్యోతి చెప్పింది. 2016 వరకు తమ జీవితం చాలా సంతోషంగా సాగిందని, గత నాలుగేళ్లుగా తన భర్త ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి సరిగ్గా రాకపోవడంతో మహేందర్ పై అనుమానం వచ్చిందని తెలియజేసింది. ఈ విషయంపై ఆరా తీయగా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసిందని వెల్లడించింది. 


ఆ సంబంధంపై తన భర్తను నిలదీయగా ఇద్దరూ కలిసి నన్ను, నా పిల్లలను చంపేస్తామని బెదిరించినట్లుగా జ్యోతి ఆరోపించింది. మా ఫ్యామిలీ ఆస్తులను మొత్తం అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు రాసిచ్చాడని వాపోయింది. హైదరాబాద్లో ఓ ఇల్లు కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు కొనిచ్చాడని జ్యోతి చెప్పింది. వీరిద్దరి అక్రమ సంబంధంపై, బెదిరింపులపై గతంలో ఉన్న ఎస్పీలకు అనేకసార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదని వెల్లడించింది. అందుకే కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లుగా జ్యోతి తెలిపారు. 


ప్రస్తుత ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని జ్యోతి అన్నారు. అలాగే నేను చనిపోవడానికి కారుణ్య అనుమతి ఇవ్వాలని ఫిర్యాదులో జ్యోతి కోరింది. తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదంటే న్యాయం చేయాలి అని కలెక్టర్ ను వేడుకుంటుంది ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి. ఈ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. మరి జ్యోతికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: