తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదా కొంప ముంచింది.. సెల్ఫీ సరదా కు వెళితే ఏకంగా ఏడుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఇందులో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన  సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో సెల్ఫీ దిగడానికి వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతు అయ్యారు.  అయితే.... ఇందులో మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడటం జరిగింది.  ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు... అలర్ట్‌ అయ్యారు.


కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌ వద్దకు చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై సీఎం రేవంత్‌ రెడ్డి కూడా స్పందించారు. మర్కుక్ (మం) కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటన పై సిఎం రేవంత్ ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రప్పించాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని సూచనలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.



మృతుల వివరాలు ఇవే:
1. ధనుష్ s/o నర్సింగ్ (వయస్సు 20 సంవత్సరాలు)-ముషీరాబాద్

2. లోహిత్ s/o నర్సింగ్ (వయస్సు 17 సంవత్సరాలు)- ధనుష్ సోదరుడు

3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ (వయస్సు 17 సంవత్సరాలు)-బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ

4. సాహిల్ s/o దీపక్ సుతార్ (వయస్సు 19 సంవత్సరాలు)

5. జతిన్ s/o గోపీనాథ్ (వయస్సు 17 సంవత్సరాలు)- ఖైరతాబాద్ చింతల్ బస్తీ

బతికి బయటపడినవారి వివరాలు:

1. కొమారి మృగాంక్ s/o వేణుగోపాల్ ( వయస్సు 17 సంవత్సరాలు ) -ముషీరాబాద్, రాంనగర్

2. మహ్మద్ ఇబ్రహీం s/o మహ్మద్ హసన్ ( వయస్సు 20 సంవత్సరాలు ) - ముషీరాబాద్





మరింత సమాచారం తెలుసుకోండి: