ఆంధ్రప్రదేశ్ అబ్బాయి, మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి ఇద్దరు గత కొంతకాలం ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్ద ప్లాన్ వేశారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికోసం గంజాయి వ్యాపారాన్ని చేయడం ప్రారంభించారు. బయట ఎక్కడైనా గంజాయి వ్యాపారాన్ని చేస్తే దొరుకుతాము అనే భయంతో ఎవరికి దొరకకుండా ఉండడానికి ఓయో రూమ్ లను టార్గెట్ చేశారు. ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి వ్యాపారాన్ని చేయడం ప్రారంభించారు. 

ఓయో రూమ్స్ లో ఉంటూ ఇద్దరూ చేస్తున్న దందాను హోటల్ మేనేజ్మెంట్ బయట పెట్టారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. కొండాపూర్ లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి దందా చేస్తున్న యువతి యువకుడిని ఎస్టిఎఫ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఎస్టిఎఫ్ అధికారి నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల మేరకు.... ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేంద్ర రాజు (25)కు మధ్యప్రదేశ్ కి చెందిన సంజన మాంజా (18)లో కొంతకాలం క్రితమే పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ప్లాన్ తో ఓయో రూమ్స్ లో గదులను అద్దెకు తీసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా కొండాపూర్ లోని ఓయో రూమ్ లో ఉంటూ గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎస్టిఎఫ్ బృందం తనిఖీలు నిర్వహించి అసలు గుట్టును బయటపెట్టింది.

పక్క సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి ఓయో రూమ్ నుంచి విక్రయాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: