హనుమకొండ జిల్లాలో... విషాద సంఘటన జరిగింది. లైవ్ లోని ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు ఒక వ్యక్తి. ఓ మహిళ కారణంగా.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త మర్డర్ వరకు వచ్చింది. అందరూ చూస్తుండగానే... ఓ వ్యక్తిని ఎంత కిరాతకంగా.. మరొక వ్యక్తి చంపాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లాలో... సిటీ నడిబొడ్డున జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


హనుమకొండ జిల్లాకు సంబంధించిన బొల్లికొండ లావణ్య అనే మహిళ కారణంగా... అదే పట్టణానికి సంబంధించిన రాజ్ కుమార్ అలాగే వెంకటేశ్వర్ల మధ్య గొడవ జరిగింది. రాజ్‌ కుమార్ అలాగే వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లు. అయితే ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం గడిపే.. రాజ్‌ కుమార్ అలాగే వెంకటేశ్వర్లకు బొల్లికొండ  లావణ్య అనే మహిళతో... అక్రమ సంబంధం ఏర్పడిందట. అయితే..  రాజ్ కుమార్ అలాగే వెంకటేశ్వర్లు ఉంటున్న దగ్గరే ఈ బొల్లికొండ లావణ్య నివాసం ఉంటుందని సమాచారం.


అయితే బొల్లికొండ లావణ్య... ఒకరికి తెలువకుండా మరొకరితో... అక్రమ సంబంధం నడిపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే తాజాగా ఈ విషయం... వెంకటేశ్వర్లుకు తెలిసిందట. దీంతో రాజ్ కుమార్ ను వెంకటేశ్వర్లు ఇవాళ నిలదీశాడు. హనుమకొండ నడిరోడ్డు పైనే... రాజ్ కుమార్ తో వెంకటేశ్వర్లు గొడవ పెట్టుకున్నాడు. ముందస్తుగానే తన దగ్గర ఒక కత్తిని కూడా భద్రపరచుకున్నాడు  వెంకటేశ్వర్లు. దీంతో అందరు చూస్తుండగానే... రాజ్ కుమార్ ను హత్య చేశాడు వెంకటేశ్వర్లు.

అయితే వారిద్దరిని ఆపే ప్రయత్నం అక్కడి జనాలు చేసినప్పటికీ... అప్పటికే రాజ్ కుమార్ ను పొడిచాడు వెంకటేశ్వర్లు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రాజ్ కుమార్... మృత దేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: