ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న... రిటైర్డ్ జవాన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ అలాగే వెంకటరమణ ఇద్దరు భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె వెంకట మాధవి. అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి వెంకట మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. మాధవి అలాగే గురుమూర్తిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పనిచేసి... రిటైర్మెంట్ తీసుకున్నాడు.
ప్రస్తుతం కాంచన్బాగ్ లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా తన భార్య వెంకట మాధవి పై అనుమానం పెంచుకున్నాడు గురుమూర్తి. ఈ విషయంలో వెంకట మాధవి అలాగే గురుమూర్తికి... తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీన తన భార్యతో గొడవపడి ఆ తర్వాత... ఆమెను చంపేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా తన భార్య కనపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేసి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తన భార్యను చంపేసి.. ముక్కలుగా చేశాడట. ఎముకలు అలాగే మాంసాన్ని వేరుచేసి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాడట. ఆ తర్వాత డ్రైనేజీ, మీర్పేట చెరువులో పాడేసినట్లు తెలుస్తోంది. అయితే తన భార్యను చంపే కంటే ముందు కుక్కని చంపేసి ప్రాక్టీస్ చేశాడట గురుమూర్తి. ఇక ఈ సంఘటన ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.