గురుమూర్తి ఇంట్లో ఇన్ఫ్రా రెడ్ చేయగా.. రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దీంతో గురుమూర్తి ఇంట్లోని బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు నరికినట్లు స్పష్టం అయ్యింది. అయితే చంపిన తర్వాత రక్తపు మరకలు పోయేందుకు 10 సార్లు బాత్ రూమ్ ని కడిగినట్లు సమాచారం. శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్ళను పోలీసులు సేకరించారు. కాల్చిన ఆనవాళ్ళలో పోలీసులు dna సేకరించి.. దొరికిన dna తో పిల్లల dna తో టెస్ట్ చేయనున్నారు. అయితే గురుమూర్తి పిల్లలు పండగ తర్వాత ఇంటికి తిరిగిరగానే ఇల్లంతా వాసన వచ్చినట్లు తెలిపారు. అమ్మ ఎక్కడ నాన్న అని అడిగిన కూడా గురుమూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం పోలీసులు, గురుమూర్తి హత్య చేయడానికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. గురుమూర్తి మాత్రం తన భార్య మాధవిని చంపిన విధానంపై ఒక్కో సారి ఒక్కోలా పోలీసులకు చెప్తున్నాడు. అలాగే పొంతన లేని సమాధనాలతో కేసును తప్పు త్రోవ పట్టించేందుకు ప్రయతినిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక దొరికిన DNA తో పిల్లల dna తో టెస్ట్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది. ఇక అది బయటపడితే.. ఈ కేసు మళ్లీ ఏ మలుపు తీరుగుతుందో చూడాలి మరి.