ఈ కేసులో పోలీసులు మొదట ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అత్యాచారం చేశాడనేది ప్రధాన ఆరోపణ. కానీ, పోలీసుల విచారణలో ఊహించని ట్విస్ట్‌లు బయటపడ్డాయి. పోలీసులు చెప్పేది ఏంటంటే, ఆ యువతి ముంబైకి దగ్గరలోని నాలాసోపరా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రుల తిట్ల నుంచి, దెబ్బల నుంచి తప్పించుకోవడానికే ఆమె అలా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటో డ్రైవర్ తనను రేప్ చేశాడని చెబితే ఇంట్లో వాళ్లు ఏమీ అనరని ఆమె భావించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఆ యువతి ఆటో డ్రైవర్‌తో కలిసి అర్నాలా బీచ్‌కు వెళ్లింది. అది ఆమె ఇంటి నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరం. అక్కడ రాత్రంతా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. ఐడీ కార్డు లేకపోవడంతో హోటల్ రూమ్ దొరకలేదు. దీంతో బీచ్‌లోనే నిద్రపోయారు. అక్కడే అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని తెలుస్తోంది.
రేప్ జరిగిందని భయపడిన ఆ యువతి ఇంటికి వెళ్లలేకపోయింది. నేరుగా నాలాసోపరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ భయాందోళనలో సర్జికల్ బ్లేడ్ కొనుక్కుంది. ఆ బ్లేడ్‌తో పాటు రాళ్లను కూడా తన ప్రైవేట్ పార్ట్‌లో పెట్టుకుంది. దీంతో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడంతో ఆమె స్థానిక పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌పై రేప్ కేసు నమోదు చేశారు.
విచారణలో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. మొదట ఆ యువతి తాను వారణాసిలో అంకుల్‌తో కలిసి ఉంటానని అనాథనని చెప్పింది. కానీ, పోలీసులకు ఆమె తండ్రి ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఆమె గతంలో కూడా రెండుసార్లు రేప్ ఫిర్యాదులు చేసిందట. నిర్మల్ నగర్, శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లలో 2023లోనే ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమె మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక సమస్యల వల్లే ఇలా చేస్తోందా అని ఆలోచిస్తున్నారు.
మొత్తానికి ఈ కేసు చాలా గందరగోళంగా, మిస్టరీగా మారింది. పూర్తి విచారణ తర్వాతే అసలు నిజం ఏంటో తెలుస్తుంది. ఈ ఘటన మాత్రం ముంబైలో సంచలనం రేపింది.