భార్యను ముక్కలుగా చేసిన కేసులో ట్విస్ట్‌ నెలకొంది. మలయాళ క్రైమ్, థ్రిల్లర్ "సూక్ష్మ దర్శిని" వెబ్ సిరీస్ స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేశానని గురుమూర్తి పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం గురుమూర్తి చేసిన హత్య ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. సూక్ష్మ దర్శిని సినిమాలో దత్తత తీసుకున్న కూతురుని తల్లి, కుమారుడు కలిసి అతి దారుణంగా హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేయడానికి శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగించారు.


ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా బయటకు వదులుతారు. ఈ సినిమాలో చేసిన విధంగానే గురుమూర్తి కూడా తన భార్యను మాయం చేశాడు. గురుమూర్తి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ప్రస్తుతం డి ఆర్ డి ఓ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఇక గురుమూర్తి తన బంధువులలోని ఓ మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తన భార్య మాధవికి తెలియడంతో గురుమూర్తిని నిలదీసింది.


దీంతో గురుమూర్తి ఆమెను బలవంతంగా తోసాడు. వెంటనే మాధవి తన ప్రాణాలను వదిలింది. దీంతో ఏం చేయాలో తెలియక గురుమూర్తి చనిపోయిన మాధవి డెడ్ బాడీని 72 ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నింటినీ హీటర్ లో వేసి బాగా ఉడికించాడు. అనంతరం బొక్కలను, ముక్కలను వేరు వేరు చేసి బొక్కలను మళ్లీ బాగా కాల్చేశాడు. వాటిని మళ్లీ దంచి పొడి చేశాడు. ముక్కలను మెత్తగా దంచి ఆ రెండింటినీ కలిపి ఓ సంచిలో వేసుకొని సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు.


ఈ విషయాన్ని గురుమూర్తి స్వయంగా పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. మాధవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అలా ముక్కలుగా చూసి విలవిలలాడిపోతున్నారు. సూక్ష్మ దర్శిని సినిమా చూసి నా కూతుర్ని అలా చేశాడని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: