ఆ దారుణ హత్యతో హైదరాబాద్ మాత్రమే కాదు, యావత్ దేశమే ఉలిక్కిపడింది. నమ్మి వచ్చిన భార్యను కట్టుకున్నోడే అత్యంత పాశవికంగా అంతం చేసాడు. సాధారణంగా చంపేస్తే అంత పెద్ద న్యూస్ అయ్యేది కాదేమో! భార్యను ముక్కలు ముక్కలు కింద నరికి, శరీర అవశేషశాలను ఉడికించి.. పొడి చేసి మరీ.. ఎవ్వరికి అనుమానం రాకుండా శవాన్ని మాయం చేశాడు. ఈ ఘటనతో హైద్రాబాదులోని మీర్‌పేట్ లో జరిగింది. చంపింది మాజీ సైనికుడు కావడం కొసమెరుపు. తన భార్యను నరికి, ఎలక్ట్రిక్ హీటర్‌తో బకెట్‌లో ఆమె భాగాలను ఉడికించి, ఆపై ఎముకలను పౌడర్ చేసి, అన్నింటినీ పారవేశాడు.

జిల్లెలగూడకు చెందిన గురుమూర్తి జనవరి 15న, సరిగ్గా సంక్రాంతి రోజున తన భార్య వెంకటమాధవిని హత్య చేసి, ఆపై స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. హత్యకు సంబంధించి అతని స్నేహితుడిని కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను హత్య చేసిన తర్వాత 8 సార్లు కాల్‌లు చేశారని, అందులో ఒకటి బడంగ్‌పేటలో ఉంటున్న తన సోదరికి చేసినట్టు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. అనేక మలుపులు తరువాత తాజాగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.

ఇక పోలీసుల దర్యాప్తులో నేరస్తుడు గురుమూర్తి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గురుమూర్తి కొలీగ్స్ గురుమూర్తి గురించి చాలా పాజిటివ్ గా స్పందించడం కొసమెరుపు. గురుమూర్తి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, అనవసరంగా ఒకరితో గొడవలు పడే రకం కాడని వెల్లడించారు. భోజనం కేవలం స్టీల్ ప్లేట్స్ లోనే తింటాడని, ప్లాస్టిక్ అస్సలు వాడడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనవసర స్నేహాలు చేయడని, ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడని అన్నారట. దాంతో ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకోవడం కోసమే గురుమూర్తి ఇలా ప్లాన్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆనవాళ్లు లేకుండా చేయడానికి నిందితుడు ఎంత యత్నించినా మృతదేహాన్ని ముక్కలు చేసిన వస్తువులు, గదిలోని వస్తువులపై మానవ అవశేషాలను పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. దాదాపు వారంరోజుల పాటు శ్రమించిన పోలీసులు చివరకు సాక్ష్యాలు సంపాదించగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: