అప్పటి నుంచి కొండయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు దంపతుల వద్దనే ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు తన పెద్ద కుమారుడు, కోడలికి భారంగా మారాడు. తరచూ వెంకటేశ్వర్లు తండ్రి విషయంతో తన భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు కారు మాట్లాడుకుని తన తండ్రిని తీసుకొని ఈపూరు ఊరు వైపుకు వెళ్లాడు.
ఈపూరు మండలం బద్రుపాలెం వద్దకు చేరుకున్న వెంకటేశ్వర్లు సాగర్ కాలువ కట్టపై కారును ఆపాడు. తన తండ్రి కొండయ్యను కారులో నుంచి బయటకు దించి రెండు చేతులతో ఎత్తి కాలువలో పడేశాడు. ఈ ఘటనను దూరం నుంచి చూసిన స్థానిక రైతులు అక్కడికి చేరుకుని వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. అప్పటికే కాలువలో మునిగిపోతున్న కొండయ్య రక్షించమని వేడుకున్నాడు.
దీంతో అక్కడ ఉన్న వారు కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో కళ్ళముందే కొండయ్య నీటిలో మునిగి మృతి చెందాడు. వెంకటేశ్వర్లను పట్టుకున్న స్థానిక రైతులు అతడిని చితక బాది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటేశ్వర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.