![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/crime/135/crimeb3482d58-bb73-4396-af96-02c92224e620-415x250.jpg)
గురుమూర్తి ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయ్యి ప్రస్తుతం DRDOలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత స్థానికంగా జిల్లెలగూడలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. భార్యభర్తలది ఒకే ఊరు కావడం గమనార్హం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గురుమూర్తి కుటుంబానికి… మాధవి కుటుంబానికి తీవ్రస్థాయిలో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబ విషయాలపై 5 సంవత్సరాల క్రితం సొంత ఊరిలో పెద్దల సమక్షంలో వీరి పంచాయతీ నడిచింది. ఈ ఘటన తర్వాత గురుమూర్తి మళ్లీ అతని అత్తగారింటికి వెళ్లిన దాఖలాలు కనబడలేదు. అదేవిధంగా భార్యను కూడా వెళ్లనివ్వలేదు. అయితే, జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఇంటికే కాకుండా తన కన్నవారి ఇంటికి సైతం తీసుకెళ్లాలని మాధవి గురుమూర్తిని పట్టుబట్టినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో జనవరి 15న ఇద్దరికీ తీవ్రస్థాయిలో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో గురుమూర్తి “ఇంత జరిగిన కూడా ఏ మొహం పెట్టుకొని సొంత ఊరికి తీసుకెళ్లమంటున్నవ్!” అంటూ మాధవిపై ఆవేశంతో ఊగిపోయాడు. ఈ గొడవ జరుగుతున్న క్రమంలోనే మాధవి గొంతు నలిమి గోడకేసి కొట్టడంతో మాధవి స్పాట్లోనే చనిపోయింది. మాధవి చనిపోయినట్లు ఆధారాలు లభించకుండా చేస్తే, కేసునుండి తప్పించుకోవచ్చు అని ఆలోచన చేసిన గురుమూర్తి చనిపోయిన మాధవి మృతదేహన్ని కిచెన్‌లోకి తీసుకెళ్లి, శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకుంటూ మొత్తం 70 భాగాలుగా శరీరాన్ని కట్ చేశాడు. ఆ తర్వాత మాధవి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో వారు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుంటే... అసలు విషయం బయట పడింది. కేసులో గురుమూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే!