హైదరాబాద్‌ లోని మీర్‌పేట్ గురుమూర్తి..ఇటీవల భార్యను హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే.. గురుమూర్తి చేసిన తరహాలోనే ఏపీలో మరో దారుణం జరిగింది. కొడుకును ముక్కలుగా నరికి..గోన సంచుల్లో ప్యాక్‌ చేసింది తల్లి. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశంకు చెందన కందం శ్యామ్ ప్రసాద్ హత్యకు గురయ్యాడు. అతన్ని స్వయంగా కందం శ్యామ్ ప్రసాద్ తల్లే హత్య చేసింది.


దీంతో కంభం తెలుగువీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు కందం శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో హత్య చేసింది తల్లి లక్ష్మీదేవీ అలియాస్ సాలమ్మ. కందం శ్యామ్ ప్రసాద్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోన సంచుల్లో కుక్కి పార్సిల్‌ చేయిందట తల్లి సాలమ్మ. దీంతో... ఆమె ఆదేశాల మేరకు కందం శ్యామ్ ప్రసాద్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి...  వీధి పంట కాలువ వద్ద పడవేశారు నిందితులు.


అయితే.. నిందితులు... పంట కాలువ వద్ద మృతదేహాన్ని పడవేస్తుండగా చూశారు అక్కడే ఉన్న స్థానికులు. దీంతో  కందం శ్యామ్ ప్రసాద్ హత్య విషయం బయటకు వచ్చింది.  కందం శ్యామ్ ప్రసాద్ ను చంపారని చుట్టుపక్కల పుకార్లు వ్యాప్తి చెందడంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అన్న సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించడంతో వెలుగులోకి ఈ హత్య ఘటన బయట పడింది. మద్యానికి బానిసై సైకోగా ప్రవర్తిస్తున్న కొడుకు శ్యామ్ ను తల్లి హత్య చేయించిందని ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు.


లారీ క్లీనర్ గా రెండు రోజుల క్రితం కర్నూలు వెళ్లిన  కందం శ్యామ్ ప్రసాద్.. అక్కడ మద్యం తాగి గొడవ చేయడంతో ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీసుల పర్యవేక్షణలో శ్యామ్ మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతదేహం లభించిన వద్దే పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాత్రంతా మృతదేహం వద్ద కాపలాగా ఉన్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: