అనంతపురం జిల్లా లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లి మండలం, గుండాల గోన లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ తరుణంలోనే అక్కడికి వచ్చిన భక్తులను ఏనుగులు తొక్కేశాయి. ఈ సంఘటనలో ఏకంగా నలుగురు భక్తులు మరణించారు. ఈ సంఘటన ఇప్పుడు ఏపీ లో విషాదాన్ని నింపాయి. ఈ సంఘటన వివరాలు ఒక సారి పరిశీలిస్తే.... రేపు అంటే గురువారం రోజున శివ రాత్రి అన్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మహాశివరాత్రి  ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక రేపు మహాశివరాత్రి ఉన్న నేపథ్యంలో... 30 మంది భక్తులు అనంతపురం జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఉన్న గుండాల గోనలో... శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తున్నారు. అయితే అక్కడ అడవి ప్రాంతం ఉన్న నేపథ్యంలో... అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు... చుక్కలు చూపించాయి.


శివయ్య భక్తులను ఒక ఆటాడుకున్నాయి.  శివాలయంలో జాగరణ చేసేందుకు వెళుతుండగా ఏనుగులు తొక్కి చంపాయి. ఈ సంఘటనలో ఏకంగా  నలుగురు భక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెబుతున్నారు. ఏనుగుల తొక్కి చంపిన వారిలో వై కోట  ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు  అధికారులు గుర్తించారు. ఇక ఈ సంఘటనలో గాయపడ్డ వారిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు.



అయితే ఈ సంఘటన పైన... వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి చేర్పించి... అత్యాధునిక వైద్య సదుపాయం అందించాలని... పేర్కొంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం.  ఏనుగుల ప్రమాదానికి సంబంధించిన సంఘటనపై... పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది...? పరిస్థితి అదుపు తప్పడానికి గల వివరాలను తెలుసుకుంటున్నారు. అయితే ఏపీ చరిత్రలో... ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: