
డాక్టర్ సుమంత్ రెడ్డి పై దాడి చేయించింది డాక్టర్ భార్య. ఇక ఆమెకు చాలా మంది సాయం కూడా చేశారు. ప్రియుడితో పాటు ఓ పోలీస్ అధికారి కూడా ఆమెకు సాయం చేశాడని అంటున్నారు. అయితే.. దాదాపు 8 రోజులు ప్రాణాలతో పోరాడి వరంగల్ ఎంజీఎం లో మృతి చెందాడు డాక్టర్ సుమంత్ రెడ్డి. కారులో వస్తుండగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
ఇక కోమలో ఉన్న డాక్టర్ సుమంత్ రెడ్డి కోలుకోవడం కష్టమని తెలిసి చెప్పారు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు. దీంతో డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఒకరోజు వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొంది ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు డాక్టర్ సుమంత్ రెడ్డి. అయితే...తాజాగా డాక్టర్ సుమన్ రెడ్డి మృతదేహానికి ఈ రోజు మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు.
డాక్టర్ సుమంత్ రెడ్డి దాడి ఘటనలో ఆయన భార్య ఫ్లోరా మరియు ఆమె ప్రియుడు సామెల్ ఉన్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. అలాగే... ఆమె ప్రియుడు సామెల్ స్నేహితుడు ఏ అర్ కానిస్టేబుల్ అయిన రాజ్ కుమార్ కూడా ఈ కేసులో ఉన్నాడు. దీంతో... ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నేపంతోనే... డాక్టర్ సుమంత్ రెడ్డి పై దాడి చేయించింది డాక్టర్ భార్య ఫ్లోరా. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.