
వీటన్నిటికీ మూల కేంద్రం అక్రమ సంబంధమే అవుతుంది. అయితే తాజాగా ఇద్దరు పిల్లలు అలాగే భర్తను వదిలేసి ఓ యువతి... సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో పారిపోయింది. ప్రియుడే కావాలంటూ... కట్టుకున్న వాడితో పాటు పిల్లల్ని కూడా వదిలేసింది ఆ మహిళ. ఇప్పుడు ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త అలాగే పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5వ తేదీన... సుకన్య అనే 35 సంవత్సరాల మహిళ తన ప్రియుడుతో లేచిపోయింది. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లడంతో తన భార్య మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇచ్చాడు భర్త జయరాజ్. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు.. చేయడం మొదలుపెట్టారు. ఈతరణంలోనే... విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
సోషల్ మీడియాలో గోపి అనే 22 సంవత్సరాల యువకుడితో సుకన్యకు పరిచయం అయిందట. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది అని పోలీసులు తేల్చారు. అయితే... ప్రియుడితోటే కలిసి ఉండాలని... గత నెలలో.... గోపితో జంప్ అయింది సుకన్య. అయితే లేటెస్ట్ గా వీళ్ళిద్దరూ బైక్ పై వెళుతుండగా కనిపించారట. ఆ సందర్భంగా భర్త జయరాజు ఫాలో అయి పట్టుకునే ప్రయత్నం చేశాడట. కానీ వాళ్ళు చాకచక్యంగా మరో బస్సు ఎక్కి పారిపోయారట. ఇక పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై సభ్య సమాజం ఛీ కొడుతోంది.