
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అఘోర పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అఘోర బాబా అలియాస్ రాజేష్ నాథ్. అఘోర బాబా అలియాస్ రాజేష్ నాథ్ తణుకు ప్రాంతమే. ఇద్దరు అమ్మాయిలతో రాజేష్ నాథ్ అసభ్య చాటింగ్ చేసి.... ట్రాప్ చేశాడు. 2024 ఏప్రిల్ లో వ్యక్తిగత సమస్యలతో తనుకులో రాజేష్ నాథ్‌ని కలిశారు ఇద్దరు బాధితురాలు. రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామని చాట్ చేశాడు అఘోర బాబా అలియాస్ రాజేష్ నాథ్.
అక్కడితో ఆగకుండా...ఆ ఇద్దరు మహిళలతో దారుణంగా చాటింగ్ చేశాడు. చాటింగ్‌లో న్యూడ్ వీడియోలు పంపి ఇలా చేయాలంటూ చెప్పాడట అఘోర బాబా అలియాస్ రాజేష్ నాథ్. అయితే... రాజేష్ నాథ్ ఆగడాలు భరించలేక.. అందులోని బాధితురాలు బయటకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ విడియో రిలీజ్ చేయడం జరిగింది బాధితురాలు. రాజేష్ నాథ్‌ను నమ్ముకొని మోసపోకండి అంటూ బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో... రాజేష్ నాథ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. రాజేష్ నాథ్ లీలలు బయటకు రావడంతో.. ఈ సంఘటన పై లేడీ అఘోర రెచ్చిపోయారు. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ... తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందుకు వచ్చింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న లేడీ అఘోరీ....తన దగ్గర ఆధారాలున్నాయని సంచలన విషయాలు చెప్పింది. దీంతో లేడీ అఘోరీని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.