ఈ మధ్యకాలంలో... లైంగిక దాడుల విపరీతంగా పెరుగుతున్నాయి. వాయి - వరుస లేకుండా... మహిళ కనబడితే చాలు కొంతమంది కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లైంగిక దాడులు చేస్తున్నారు. కొంతమంది తోడబుట్టువులను కూడా... లైంగికంగా వేధించడం మనం చూశాం. అయితే... తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల కుర్రాడిపై... 13 సంవత్సరాలు ఉన్న బాలుడు లైంగిక దాడి చేశాడు.


ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా టేకులపల్లి కేసీఆర్ టవర్... లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆరు సంవత్సరాలు ఉన్న బాలుడు పైన..  13 సంవత్సరాల ఓ కుర్రాడు లైంగిక దాడి చేశాడట. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతోందట.  అయితే తాజాగా.. ఆరు సంవత్సరాల బాలుడు... తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.


 వాంతులు అలాగే విరేచనాలు కూడా జరిగాయట. విపరీతమైన కడుపునొప్పికి ఆ బాలుడు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అసలు విషయం కుటుంబ సభ్యులతో చెప్పాడట ఆరు సంవత్సరాల కుర్రాడు. దీంతో ఆ ఆరు సంవత్సరాల కుర్రాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కూడా ఈ లైంగిక దాడి విషయం తేలిందని తెలుస్తోంది. సరైన సమయానికి బాలున్ని ఆసుపత్రికి తీసుకురావడం... మంచిదైందని వైద్యులు చెబుతున్నారు.

 ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యం కాస్త కుదిరితే పడినట్లు తెలుస్తోంది. అయితే 13 సంవత్సరాల బాలుడు.. పైన బాధిత కుటుంబం... స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటనపై... కేసు బుక్ చేసుకోకుండానే పోలీసులు విచారణ... చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా మైనర్లే. తెలిసి తెలియని వయసు. అందుకే ఈ కేసును కాస్త ఆచితూచి... పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: