వరంగల్ పోలీసులు ఓ షాకింగ్ కేసును ఛేదించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న ఓ డేంజర్ లేడీని అరెస్ట్ చేశారు. తప్పిపోయిన కూతురు కోసం కంగారుపడుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులకు చిక్కిన ఈ కిలాడీ లేడీ పేరు చెప్పాలంటే... ఆమె డ్రగ్స్‌కు బానిస. దమ్మేర మండలం పరిధిలోని ఓ పల్లెటూరు ఆమె స్వస్థలం. కానీ, మకాం మాత్రం వరంగల్ మిల్స్ కాలనీలో మార్చేసింది. అక్కడ ఓ ముఠా కట్టుకుని మరీ రెచ్చిపోయింది. తనలాగే డ్రగ్స్‌కు బానిసైన ఓ అమ్మాయిని, మరో నలుగురు కుర్రాళ్లను తన గ్యాంగ్‌లో చేర్చుకుంది. అంతే.. వరంగల్‌లోని బడా కాలనీలు, కార్పొరేట్ స్కూల్సే వాళ్ల టార్గెట్.

అసలు స్కెచ్చే ఇక్కడ మొదలైంది. ఈ కిలాడీ లేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. అందులో తనను తాను ‘మీ అక్కని’ అంటూ పరిచయం చేసుకుంది. లగ్జరీ కార్లలో తిరుగుతూ, బ్రాండెడ్ బట్టలు వేసుకుని ఫొటోలు దిగేది. ట్రెండింగ్ సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ రీల్స్ చేసేది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆమెను ఫాలోవర్లుగా మారిపోయారు.

ఇక అసలు పని మొదలుపెట్టింది కిలాడీ లేడీ. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసేది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ చూపిస్తూ వాళ్లను బాగా ఇంప్రెస్ చేసేది. ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నమ్మకం కలిగేలా చేసేది. అంతే.. క్లోజ్ అయ్యాక అమ్మాయిలను కిడ్నాప్ చేసేది. కిడ్నాప్ చేసిన అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ తప్పాక వాళ్లతో వ్యభిచారం చేయించేది.

దాదాపు ఏడాదిన్నరగా ఈ గ్యాంగ్ ఇదే పని చేస్తూ చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేవారని సమాచారం.

అయితే, వరంగల్ మిల్స్ కాలనీ ఏరియాలో తప్పిపోయిన ఓ అమ్మాయి ఇంటికి తిరిగి రావడంతో ఈ కేసు ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. తనను ఓ లేడీ కిడ్నాప్ చేసిందని ఆ అమ్మాయి చెప్పింది. డ్రగ్స్ ఇచ్చి కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్పిందామె. మెడికల్ టెస్టుల్లో అమ్మాయికి నిజంగానే డ్రగ్స్ ఇచ్చారని తేలింది.

అమ్మాయి స్టేట్‌మెంట్, ఆధారాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ‘కిలాడీ లేడీ గ్యాంగ్’ గుట్టు రట్టు చేసి, ఆ లేడీని అరెస్ట్ చేశారు. ముందు ముందు ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: