
కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చారు మైనర్ బాలిక (14). అయితే... ఈ నెల 13న ఒక వివాదం తలెత్తడంతో మనస్తాపానికి గురై ఆ ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చింది ఆ బాలిక. ఇక ఇది గమనించిన ఇద్దరు యువకులు జి.కొండూరులో దింపుతామని బైక్ పై తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆ తర్వాత వారి ఐదుగురు స్నేహితులను పిలిచి దాదాపు 4 రోజుల పాటు బాలికపై ఏడుగురు యువకుల సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. చివరకు బాలికను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలి వెళ్లారట యువకులు. అయితే... నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న బాలికను గమనించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు మరో ఆటో డ్రైవర్.
అనంతరం ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించి, ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఏడుగురు నిందితుల్లో ఒకరు ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన మైనర్ బాలుడిగా గుర్తించిన పోలీసులు.. ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక బాధిత మైనర్ ను కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.