దేశంలో రోజురోజుకు దారుణాలు జరుగుతున్నాయి. దేశంలో ఏదో ఒక మూలన... మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ... కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నప్పటికీ... మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కచ్చితంగా.. ఎవరో ఒకరు ఏదో ఒక మూలన దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాదులో మహా దారుణం జరిగింది.

హైదరాబాద్ ఎంఎంటీఎస్  రైలులో ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు  ఓ కామాంధుడు. ఎంఎంటీఎస్.. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళపై దారుణంగా వ్యవహరించాడు. మొదటగా మాట్లాడి.. ఆ తర్వాత దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు.   మాట మాట కలిపి... దారుణానికి ఒడిగట్టాడు. అయితే.. ఇద్దరు ప్రయాణిస్తున్న ఎంఎంటిఎస్ భోగిలో... ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఒక్కో స్టాప్ లో దిగిపోయారు. అయితే కొంపల్లి వచ్చే సమయానికి.. ప్రయాణికులందరూ దిగగా ఈ ఇద్దరు మాత్రమే మిగిలారు..

 ఇదే అదునుగా చేసుకున్న ఆ కామాంధుడు.. ఆ మహిళపై లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. భోగిలో ఒక్కతే ఉండటంతో.. ఆ మహిళ ఏం చేయలేకపోయింది.  కాపాడండి    అంటూ భోగిలో అరుస్తూ మహిళ అర్ధనాథాలు చేసింది. అయితే రన్నింగ్ ట్రైన్ కావడంతో... ఆమె బాధలు ఎవరికి వినిపించలేదు. అయితే చేసేదేమీ లేక.. ఆ కామాంధుడి  నుంచి  తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి  దూకేసింది ఆ మహిళ.

 దీంతో ఇది చూసిన స్థానికులు... వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  ఈ సంఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు... నిందితుడు పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ నిండితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై... సీసీ కెమెరాలు... ఇతర ఆధారాలను పరిశీలించి... నిందితుడి కోసం  వెతుకుతున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: