
అయితే ఆ భవనం దగ్గర పని చేస్తున్న.. కార్మికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొదట ఆరు మంది... ఈ భవనం కింద పడి దుర్మరణం చెందినట్లు అంచనా వేశారు. కానీ ఆ సంఖ్య ఏడుకు చేరిందని తాజాగా స్థానికులు చెబుతున్నారు. భద్రాచలం లోని సలీం టీ స్టాల్ ముందు వీధిలో... ఆరంతస్తుల భవనం కుప్పకూలిందని సమాచారం అందుతోంది. గత ఏడాది కాలంగా ఈ ఆరంతస్తుల భవనాన్ని కడుతున్నారట.
ఈ ఆరంతస్తుల భవనం యొక్క పనులు దాదాపు చివరి దశలోకి వచ్చాయని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే... సాంకేతిక సమస్యల కారణంగా... ఈ భవనం కుప్పకూలిందని చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు కార్మికులు, మరో వ్యక్తి ఉన్నారని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరగగానే అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆర్తనాదాలు చేశారు.
వెంటనే స్థానిక పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో క్షణాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ భవనం కింద ఇరుక్కున్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై... లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరణించిన వారి పేర్లు మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భద్రాచలంలో జరిగిన ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.