దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినప్పటికీ... కామందులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు... లైంగిక దాడులకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. ఎన్కౌంటర్ లాంటి సంఘటనలు జరిగిన కొంతమంది కామాందులకు... కామ వాంఛ తగ్గడం లేదు.

 ఇప్పటివరకు మహిళలపై దాడులు చేసిన దుర్మార్గులు... ఇప్పుడు నోరులేని మూగ జీవులపై కూడా పడుతున్నారు. తాజాగా ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఆ మేకపై లైంగిక దాడి చేస్తున్న యువకుడ్ని అడ్డుకుంటే... మేక యజమానిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

 పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దోలు ప్రాంతంలో పొలం వేస్తున్న మేకను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ  35 సంవత్సరాల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే మేక కనిపించడం లేదంటూ వెతుకుతూ వెళ్లిన యజమానికి...  ఆ దుర్మార్గుడు చేసే పాడు పని కనిపించింది. మేక అరుస్తున్నప్పటికీ దానిపై లైంగిక దాడి చేస్తున్నాడట. దీంతో వెంటనే ఆ దుర్మార్గుడిపై మేక యజమాని దాడి చేశాడు.

 ఆ తర్వాత ఈ విషయాన్ని గ్రామంలో చెప్పాడు మేక యజమాని. దీంతో ఆ దుర్మార్గుడి పరువు మొత్తం పోయింది. ఈ కోపంతో మేక యజమానిపై అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు.  ప్రస్తుతం మేక యజమాని అలాగే ఆయన కుటుంబ సభ్యులు.. ప్రభుత్వాసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: