తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపాడు యువతి తండ్రి. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరువు హత్యలు ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. సూర్యపేటలో అమృత ప్రణయ్ సంఘటన మరువకముందే దాదాపు ఇప్పటివరకు పదికి పైగా ఇలాంటి పరువు హత్యలు తెలంగాణలో జరిగాయి.

 సూర్యాపేటకు చెందిన ప్రణయ్ అలాగే అమృత సంఘటనలో... మారుతీ రావు కు తీవ్ర అన్యాయం జరిగినప్పటికీ... ఆయన ఆవేశం కారణంగా తన కూతురు అమృత జీవితం రోడ్డున పడింది. అటు మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఆ దారుణ సంఘటన ను ఆదర్శంగా తీసుకొని.. ఇతర తల్లిదండ్రులు కూడా ప్రేమను.. స్వీకరించడం లేదు.

 ప్రేమిస్తే చాలు యువకుడ్ని చంపడం.. లేదా దారుణంగా కొట్టడం జరుగుతుంది. దాంతో రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం... జరుగుతోంది. అయితే తాజాగా పెద్దపల్లి లో కూడా మరో పరువు హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కు చెందిన పూరెల్ల సాయికుమార్ అనే  17 సంవత్సరాల కుర్రాడు.... ముప్పేరి తోట గ్రామానికి చెందిన.. ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నాడట.

 అయితే ఈ ప్రేమ వ్యవహారం ఆ యువతి ఇంట్లో తెలిసిందట. దీంతో  సాయికుమార్ కు చాలాసార్లు యువతి తండ్రి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ సాయికుమార్ తన ప్రేమ వ్యవహారాన్ని... కొనసాగించాడు. అయితే.. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ యువతి తండ్రికి బాగానే కోపం వచ్చింది. దీంతో సాయికుమార్ బర్త్డే రోజు.... దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి తో పాటు ఆయన బంధువులు కూడా ఈ దారుణ సంఘటనలో పాల్గొన్నారు. వాళ్లంతా ఇప్పుడు పరారీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: