నేటి కాలంలో హత్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కారణంగా భార్య భర్తలు హత్యలకు పాల్పడుతున్నారు. గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోతే అక్కడితో ఆ గొడవ ఆగిపోతుంది. కానీ గొడవలు పెద్దది చేసుకొని కొట్టుకోవడం, ఆపై ఒకరిపై మరొకరు హత్యలు చేసుకోవడం, చంపడం చాలా సులభంగా చేస్తున్నారు. ఇక మరికొంతమంది అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తలు విడిపోవడం, గొడవలు పెట్టుకోవడం, హత్యలు చేసుకోవడం చాలా సులభంగా చేస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు మరింతగా పెరుగుతున్నాయి. 

భార్యాభర్తల మధ్య ఇది మరింత ఎక్కువగా అవుతున్నాయి. రీసెంట్ గా బెంగళూరులోని హులిమావు సమీపంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలం నుంచి దొడ్డకన్నహళ్లిలో భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. రాకేష్, గౌరీ అనిల్ సంబేకర్ అనే దంపతులు ఓ ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగం చేస్తూ వారి వైవాహిక జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు.


ఇక ఏమైందో తెలియదు అకస్మాత్తుగా భార్యను చంపి, ముక్కలు ముక్కలుగా నరికి రాకేష్ చంపేశాడు. అనంతరం సూట్ కేసులో మృతదేహాన్ని తీసుకెళ్లాడు. మృతురాలి వయసు 32 ఏళ్లు. తన భార్యను హత్య చేసిన అనంతరం గౌరీ అనిల్ సంబేకర్ తల్లిదండ్రులను పిలిచి రాకేష్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించగా అక్కడికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకుని అక్కడి వివరాలను డిసిపి సారా ఫాతిమా పరిశీలించారు.


అయితే ఈ హత్యను గల ప్రధాన కారణం  తన భార్యపై అనుమానం తోనే హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని డిసిపి సారా ఫాతిమా వెల్లడించారు. ఈ హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమ కూతురు గౌరీ అనిల్ సంబెకర్  మరణాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: