అమీన్పూర్  లో ఇటీవల ముగ్గురు చిన్నారులు మరణించారు. రాత్రి పెరుగన్నం తినడంతో... ముగ్గురు పిల్లలు మరణించగా తల్లికి తీవ్ర అస్వసత నెలకొంది. దీంతో తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. అటు ముగ్గురు పిల్లలు మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రెండు రోజుల కిందట జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమీన్పూర్ లో ముగ్గురు పిల్లలకు అనుమానాస్పద మృతి జరిగిన సంఘటనలో  షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.


 వివాహేతర సంబంధం కారణంగా భర్త అలాగే పిల్లల ను చంపాలని ప్లాన్ వేసిందట తల్లి రజిత. ఆమె వయసు 45 సంవత్సరాలు.  ఇటీవల పదవ తరగతి క్లాస్ విద్యార్థుల గెట్ టు గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడిందట.    ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక... తన పిల్లలు, భర్తను కాదనుకొని ప్రియుడుతో నివాసం ఉండాలని డిసైడ్ అయింది రజిత.


ఈ తరుణంలోనే మొన్న 27వ తేదీన రాత్రిపూట భోజనం లో విషం  కలిపింది. ఆ విషయం కలిపిన భోజ నాన్ని ముగ్గురు చిన్నారులకు అలాగే ఆమె భర్తకు పెట్టడం జరిగింది. అయితే భర్త చెన్నయ్య పెరుగు అన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులు మాత్రం ఆహారాన్ని తీసుకున్నారు.

ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి... ముగ్గురు చిన్నారులు మరణించి ఉన్నారు.  కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు చెన్నయ్య. అయితే మొదట చెన్నయ్య పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విచారణలో రజిత బాగోతం బయటపడింది. ఈ విషయాలను తాజాగా.. అమీన్పూర్ పోలీసులు బయటపెట్టారు. అయితే ఆ ప్రియుడు ఎవరు..? ఎలా ప్లాన్ చేశారు అని దానిపైన విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: