
మహబూబా బాద్ జిల్లాలోని దంతాలపల్లి జ్యోతిబా పులే బాలుర గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు పార్థసారధి తన భార్య స్వప్న తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెంలో ఉంటున్నారు. స్వప్నకు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ విద్యాసాగర్ తో 2016లో స్వప్నకు పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలిసిన పార్థసారథి పెద్ద మనుష్యుల సమక్షంలో పంచాయితీ పెట్టినా వీరిద్దరు తమ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే స్వప్న తన ప్రియుడు విద్యాసాగర్ కలిసి పార్థసారథిని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. కొత్తగూడెంకు చెందిన వినయ్ కుమార్.. శివశంకర్.. వంశీ.. లవరాజులతో పార్థసారధిని చంపేస్తే.. రూ.5 లక్షలు సుపారీ ఇస్తానని విద్యాసాగర్ చెప్పారు. ఈ క్రమంలోనే ఉగాదికి భద్రాచలానికి వచ్చిన పార్థసారథి తిరిగి డ్యూటీకి వెళ్లే క్రమంలో స్వప్న ఇచ్చిన సమాచారం మేరకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ పట్టణ శివారులో అతడ్ని అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. పార్థసారధి సోదరి ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగి విచారించగా టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వప్న, విద్యాసాగరే ఈ హత్య చేయించినట్టు తేలింది.