ఆడవారికి భద్రత లేకుండా పోతోంది. అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లైంగిక దాడులు చేయడం, హత్యలు చేయడం చాలా సులభంగా చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిపై లైంగిక దాడులు రోజురోజుకు జరుగుతూనే ఉన్నాయి. మగవారు క్రూర మృగం లాగా ప్రవర్తిస్తూ ఆడవారిపై ఇలాంటి ఘటనలు చేయడానికి వెనకాడడం లేదు. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన వెలుగులోకి వస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ ఎంఎంటిఎస్ లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. 

ఈ ఘటన మరువకముందే మరో ఘటన హైదరాబాద్ నగరంలోనే తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిపారు. రక్సెల్-SEC ఎక్స్ప్రెస్ లో ఓ బాలిక ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ బాలిక అర్థరాత్రి సమయంలో వాష్ రూమ్ కు వెళ్ళింది. ఆ బాలిక వెనకాలే వెళ్లి ఓ వ్యక్తి వాష్ రూమ్ లోకి ప్రవేశించాడు. దాదాపు అరగంటకు పైనే ఆ బాలికను లైంగికంగా వేధించి హింసించాడు.
 
అంతే కాకుండా ఆ బాలికను వీడియోలు తీశాడు. రైలు సికింద్రాబాద్ కు చేరుకోగానే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ నిందితుడిని ఉరితీయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఆడవారికి కనీస భద్రత లేకుండా పోతుందని అంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలు వేడుకుంటున్నారు. ఇక తాజాగా . రక్సెల్-SEC ఎక్స్ప్రెస్ లో ఓ బాలిక  పై జరిగిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: