థాయ్‌లాండ్‌లో గుండెల్ని పిండేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కళ్లు మూసుకు తెరిచేలోపే పుట్టిన పసిగుడ్డును అనాథగా మార్చాలని చూశాడు. కారణం తెలిస్తే షాక్ అవుతారు. భార్య కాస్త విశ్రాంతి కావాలని, శృంగారానికి నిరాకరించిందట. అంతే, కోపం నషాళానికి ఎక్కి, సొంత రక్తాన్నే బలిపశువును చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన 21 ఏళ్ల ఓ దుర్మార్గుడు డ్రగ్స్‌కు బానిస. జూదమూ ఆడుతూ తిరుగుతాడు. ఇతనికి 22 ఏళ్ల భార్య ఉంది. ఇద్దరూ కొన్నాళ్లుగా కాపురం చేస్తున్నారు. పాపం ఆ భార్య రెండు వారాల కిందటే మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ కష్టాలు, ఆరోగ్యం బాగోలేకపోవడంతో కాస్త విశ్రాంతి కావాలని భర్తను కోరింది. శృంగారం కోసం తొందరపెట్టొద్దని చెప్పింది.

అంతే.. ఆ తాగుబోతు తండ్రికి కోపం బాగా పెరిగిపోయింది. ఎలాగైనా భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. పక్కనే ఉన్న అరటితోటలోకి రెండు వారాల పసిగుడ్డును ఎత్తుకెళ్లాడు. చూస్తుండగానే నేలమీద పడేసి, ఫొటో తీశాడు. ఆ ఫోటోను వెంటనే భార్యకు వాట్సాప్‌లో పంపాడు. అప్పటికే భార్య స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.

ఫోటో చూసిన ఆ తల్లి గుండె పగిలినంత పనైంది. వెంటనే ఊరి పెద్దకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. జరిగిన దారుణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసి నెటిజన్లు మండిపడ్డారు. ఇంతలో ఆ తండ్రి పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ భార్య మాత్రం ఊరుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ భర్త డ్రగ్స్‌కు బానిస అని, తనను, ఏడాది వయసున్న మరో బిడ్డను కూడా కొడుతూ హింసిస్తాడని కన్నీళ్లు పెట్టుకుంది.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ కిరాతకుడిని పట్టుకున్నారు. అసలు నిజం చెప్పమని నిలదీశారు. అప్పుడు అతను మాట మార్చాడు. "నేను పిల్లాడిని వదిలేయాలని చూడలేదు సార్. భార్యను భయపెట్టాలని అలా ఫోటో తీసి పంపా అంతే" అని బుకాయించాడు. భార్యను శృంగారం కోసం అడిగాను కానీ తప్పు చేయలేదని డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు.

పోలీసులు ఊరుకుంటారా? వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో అతను డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఇప్పుడు డ్రగ్స్ కేసుతో పాటు, సొంత బిడ్డను వదిలించుకోవాలని చూసిన నేరం కూడా అతనిపై పడింది. థాయ్ చట్టాల ప్రకారం, తొమ్మిదేళ్ల లోపు పిల్లల్ని వదిలేస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆ తండ్రిని తిట్టిపోస్తున్నారు. తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని మెచ్చుకుంటున్నారు. పిల్లల్ని కాపాడుకోవడానికి ఆమె చేసిన పోరాటానికి జేజేలు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: