ఇది రష్యాపై అమెరికా చేస్తున్న కావాలనే యుద్ధం చేయాలని చూస్తోందని ఆరోపించింది. కాదు అక్కడ జరిగిన విధ్వంసానికి మాకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా చెబుతోంది. అయితే దీన్ని రష్యా అంత తేలికగా తీసుకోవాలని అనుకోవడం లేదు. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధంలో సాయంగా నిలుస్తోంది అమెరికా. ఇప్పటికే అమెరికాపై పీకల్లోతు కోపంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు.
ఉక్రెయిన్ లోని చాలా నగరాలను రష్యా ఇప్పటికే కైవసం చేసుకుని దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సందర్భంలో మరిన్ని ఆయుధాలు ఇచ్చి యుద్ధం ఇంకా కొనసాగేలా చూడాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తుంది. యుద్దం ఆగిపోవడం అమెరికా కు ఇష్టం లేదని పుతిన్ చెబుతున్నారు. అందుకే కావాలని ఉక్రెయిన్ కు సాయం చేస్తూ రష్యాను ఏకాకిని చేయాలని వివిధ రకాల ఆంక్షలు విధించాడని అన్నారు.
ప్రస్తుతం బెల్ గ్రెడ్ లో జరిగిన దాడి వెనక అమెరికా ఆయుధాలు ఉండటం, అమెరికా పంపిన చొరబాటుదారులేనని రష్యా తేల్చడంతో రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం గనక మరింత ముందుకు వెళితే మొదట నష్టపోయేది యూరప్ దేశాలే. రష్యా అధ్యక్షుడు ఈ దాడికి ప్రతిదాడి ఎలా చేస్తారోనని అందరూ తెగ భయపడుతున్నారు.