తెలుగు రాష్ట్రాలను సుదీర్ఘ కాలం పాటు నుండి పరిపాలించుకుంటూ వచ్చిన వాళ్ళు కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మాత్రమే. అయితే ఇప్పటి వరకు , తెలుగు రాష్ట్రాలకి పరిపాలకులుగా కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు అని తెలుస్తుంది. అయితే అసంతృప్తితో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి సుదీర్ఘకాలం నుండి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.


అంతేకాకుండా కాపు ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడానికి ప్రణాళికలు కూడా చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ప్రణాళికలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి మొదట కన్నా లక్ష్మీనారాయణని, ఆ తర్వాత సోము వీర్రాజుని అధ్యక్షులుగా చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ కమ్మ వర్గానికి చెందిన పురందేశ్వరికి పగ్గాలు అప్పగించింది.  అలాగే తెలంగాణలో అయితే బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించి కిషన్‌ రెడ్డికి అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ కి రెడ్డి సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువగా పడుతూ ఉంటాయని తెలుస్తుంది.


గతంలో తెలంగాణలో తెలుగు దేశానికి నమోదయ్యే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను ఇప్పుడు కెసిఆర్ కొల్లగొడుతున్నట్లుగా తెలుస్తుంది.  ఈ కారణం మీదనే భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు కాపు ఓట్లనే  నమ్ముకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు బిజెపి తన ప్రణాళికను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ను పార్టీ ఎన్నికల  కమిటీ చైర్మన్ గా నియమించారని తెలుస్తుంది.


ఇది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థి పొజిషన్ తో సమానమైనదని తెలుస్తుంది. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఇప్పటివరకు ఆ పొజిషన్ లో ఉన్న బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలుస్తుంది. అంటే కాపు, బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు సమ న్యాయం చేసేలా నియామకాలు చేశారని తెలుస్తుంది. అయితే ఈ కొత్త నియామకాలు  కాపు, బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు  సమ్మతమేనా, కాదా అనే సందేహం కూడా ఒక పక్కన ఉందని తెలుస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP