ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారాయి. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు 33 జిల్లాలుగా మార్చారు. అయితే ఏపీలో 25 జిల్లాలు అనుకున్నారు. కానీ చివరకు 26 జిల్లాలు చేశారు. అయితే కేంద్రం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీకి పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.  దీంతో మెడికల్ కాలేజీ కోసమైనా కొత్త జిల్లా ఏర్పడాల్సిన ఆవశ్యకత వచ్చింది. అయితే గతంలో కేసీఆర్ సర్కారు చెప్పినట్లు కేంద్రం అంగీకరించ లేదు. గతంలో కేసీఆర్ సర్కారు హైదరాబాద్ చుట్టు పక్కలా మాత్రమే మెడికల్ ఏర్పాటు చేయాలని భావించారు. దీన్ని కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రాద్దాంతం చేస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. ఉన్న చోట అడగకుండా లేని చోట అడిగితే అనుమతి ఇస్తామని ప్రకటించారు.


రీసెంట్ గా మెడికల్ కాలేజీలు మొత్తం 27 పెట్టుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాని లెక్కలు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 26 మెడికల్ కాలేజీలకు 13 కొత్తవి అనుకుంటే 5 మాత్రమే అనుమతి వచ్చాయి. ల్యాండ్ ఇష్యూ, భవనాల కొరత, ఇతర టెక్నికల్ ఇష్యూలతో ఆంధ్రలో కేవలం 5 మెడికల్ కాలేజీలకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అందులో ఉన్న ఆసుపత్రులను బోధన ఆసుప్రతులుగా మార్చారు. ప్రస్తుతం పులివెందుల, ఆదోని, పాడేరు జిల్లా ఆసుపత్రులను బోధన ఆసుపత్రులుగా మారుస్తూ ప్రభుత్వం సిబ్బంది కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


శ్రీకాకుళం జిల్లా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు 41 మంది శాశ్వత ప్రాతి పదికన వైద్య సిబ్బందిని కేటాయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగంపై మరింత దృష్టి పెడుతున్నట్లు జగన్ సర్కారు చెబుతోంది. మరిన్ని మెడికల్ కాలేజీలు వచ్చేలా టెక్నికల్ సమస్యలు, ల్యాండ్ ఇష్యూలు తొలగించుకుని ముందుకు సాగాలి. అప్పుడు కేంద్రం మిగతా మెడికల్ కాలేజీలకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: