2022 డిసెంబర్ లో పదవీ బాధ్యతలు చేపట్టిన చైనా విదేశాంగ మంత్రి ఫిన్ గ్యాంగ్ నెల రోజుల నుండి కనబడడం లేదని సమాచారం. గతంలో యశ్వంత్ సిన్హా  భారతదేశ మాజీ ఆర్థిక మంత్రి. నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై కొన్ని ఆరోపణలు చేశారు యశ్వంత్ సిన్హా. మోడీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై అనేక విమర్శలు కూడా చేశారు ఆయన. ఆయన దేశ ప్రధానిని విమర్శించి కూడా భారతదేశంలో దర్జాగా తిరిగాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు.


దీన్ని భారత రాజ్యాంగపు వాక్ స్వాతంత్ర హక్కు అనుకోవాలేమో అంటున్నారు రాజకీయ నిపుణులు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి అది సాధ్యమే. అయితే ఇక్కడి కమ్యూనిస్టులు యశ్వంత్ సింగ్ కోసం సపోర్ట్ కూడా చేశారు గతంలో. కానీ చైనాలో పరిస్థితి అలా ఉండదు. ఇక్కడ భారతీయుల పద్ధతి పై ఉపన్యాసాలు ఇచ్చే వీరి పద్ధతి చైనాలో అనుమానాస్పదంగా మారింది ఇప్పుడు.


ఎందుకంటే ప్రస్తుతానికి చైనాకు సంబంధించిన  విదేశాంగ మంత్రి కనపడటం లేదని సమాచారం. ఆయన ప్రజలకు కనపడి నెల రోజులు అయిందని అంటున్నారు. నెలరోజుల క్రితం జరిగిన సదస్సులో ఆయన చివరి సారిగా కనిపించాడట. ఆ తర్వాత ఆయన చైనాలో జరిగిన ఏ కార్యక్రమంలోనూ కనపడ లేదట. ఆయన అదృశ్యం ఇప్పుడు అనుమానాస్పదమైంది అక్కడ. ఆయనను అరెస్టు చేశారో లేదా శిక్షిస్తున్నారో, లేదా చంపేశారో తెలియడం లేదు అక్కడ జనానికి.


గతంలో ఆలీబాబా కంపెనీ అధినేత జాక్మా కి కూడా ఇదే పరిస్థితి. ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో కూడా తెలియదు. ఆయన సంపాదించిన బోలెడంత ఆస్తి ఇప్పుడు ఏమైపోయిందో కూడా తెలియదు. అలాగే అక్కడ ఒక క్రీడాకారిణి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు ఏకంగా చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం అయిపోయాడు. చైనాలో జరిగేవి బయటికి రావాలంటే ఎవరో ఒకరు బయట పెడితే గాని బయటపడవు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: