ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ప్రజల మనుగడకు సవాల్ వచ్చినప్పుడు, అక్కడ వాళ్ళ బ్రతుకు సాగనప్పుడు వాళ్లు జీవనాధారం కోసం మరో ప్రాంతానికి వెళ్లిపోతూ ఉంటారు. ‌ ఈ వలసల విధానం అనాదిగా వస్తూనే ఉంది. అందులోనూ మన పక్క దేశాలన్నీ కూడా వారికి కష్టం వస్తే మొదటిగా మన వైపే చూస్తాయి. ఎందుకంటే భారత్ అనేది విశాలమైన దేశం మాత్రమే కాదు, విశాలమైన హృదయం కల దేశం కూడా.


కానీ భారత్ ఇంత విశాలమైన హృదయంతో శరణార్థులకు ఆశ్రయమిస్తుంటే వాళ్లు ఆ ఆదరణను నిలుపుకోలేకపోతున్నారు. తాము పొరుగు దేశానికి ఆశ్రయానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి ఆ దేశపు సంస్కృతిపై, ఆ దేశపు ప్రజలపై దాడులు చేయడం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఈ శరణార్థులు అనేవాళ్ళు ఎందువలన తమ దేశాన్ని వదిలి రావలసి వస్తుందంటే ముఖ్యంగా తమ దేశపు ఆర్థిక పరిస్థితులు తల క్రిందులవడం వల్ల అని తెలుస్తుంది.


అంతే కాకుండా ఆ దేశపు నాయకుల అస్థిరతలు అలాగే బలహీనతల వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు కూడా ఇలా వారి వలసలకు కారణమవుతుంటాయి. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక ఇలా మన పొరుగున ఉన్న దేశాలన్నిటి నుండి మనకు శరణార్థులు వస్తూ ఉంటారు. వారికి అక్కడ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం వల్ల వారు భారత్ కు వలసలు వస్తూ ఉంటారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మనకి లేబర్లు తక్కువ ధరకు దొరుకుతారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవనోపాధిని పొందితే పర్వాలేదు కానీ మన హిందువుల మీద  దాడులు చేస్తూ ఉంటారు.


బంగ్లాదేశ్ ప్రాంతమైన డోక్లాన్ దగ్గర చైనా సైనికులను అడ్డగించి వెనక్కి పంపించింది భారత సైన్యం. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి బంగ్లాదేశ్ ను అనేక సార్లు భారతదేశం ఆదుకుంది. కానీ ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ చైనా చెప్పు చేతుల్లో నడుస్తూ మన రక్షణ విషయాలను చైనాకు అందిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: